Surekha Vani: అక్కడ టాటూ వేయించుకున్న సురేఖ వాణి.. దేవుడితో ఆటలా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు

by I. Sairam |

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి(Surekha Vani) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

Surekha Vani: అక్కడ టాటూ వేయించుకున్న సురేఖ వాణి.. దేవుడితో ఆటలా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి(Surekha Vani) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. అయితే ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అలాగే కొన్ని సార్లు తన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ట్రోలింగ్‌కి కూడా గురవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ వీడియోతో నెట్టింట తెగ ట్రోల్ అవ్వడమే కాదు ఆమెను నెటిజన్లు పొట్టు పొట్టుగా ఏకిపారేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

తాజాగా సురేఖ వాణి తన చేతిపై గోవింద నామాలు, శ్రీవారి పాదాల్ని టాటూగా వేయించుకున్న వీడియోను షేర్ చేసింది. అయితే ఆ వీడియోలో టాటూ వేయించుకుంటున్నప్పుడు సురేఖావాణి చేసిన అరుపులు, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లపై కొంత మంది నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. అలా టాటూ వేయించుకోవడం అవసరమా? భక్తి అనేది లోపల ఉంటే చాలు కదా? ఇలా చూపించుకోవాలా? అయినా ఇందులో భక్తి ఎక్కడా కనిపించడం లేదు.. కేవలం టాటూనే కనిపిస్తోంది? దేవుడితో ఆటలా? అంటూ తమ కామెంట్స్‌తో బాగా కడిగేస్తున్నారు నెటిజన్లు.

Next Story