‘ఊచకోత - చావుమోత’.. పవన్ కల్యాణ్ OG నుంచి సూపర్ అప్డేట్

by Gantepaka Srikanth |

పవన్ కల్యాణ్ OG నుంచి సూపర్ అప్డేట్

‘ఊచకోత - చావుమోత’.. పవన్ కల్యాణ్ OG నుంచి సూపర్ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు ఓజీ చిత్రబృందం(OG Movie) సూపర్ అప్డేట్ ఇచ్చింది. సినిమా నుంచి ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా’ పాటను విడుదల చేసింది. ఊహించినట్లుగా ఈ పాట పవన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా అందులోని లిరిక్స్.. ‘ఊచకోత - చావుమోత’.. అంటూ అంటూ సాగే పాట థియేటర్‌లో దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అత్యంత పవర్‌ఫుల్‌ సాంగ్‌ ‘గన్స్‌ అండ్‌ రోజెస్‌’ (GunsNRoses) పేరిట ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. అద్వితీయ, హర్ష రాసిన ఈ పాటకు తమన్‌(Thaman) సంగీతం అందించారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న బాక్సాఫీసు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య తెరకెక్కించగా, సుజిత్(Sujeeth) దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) ప్రతినాయకుడి పాత్ర పోషించారు. వీడియో సాంగ్

Next Story