శివాజీ కొత్త సినిమాకి సూపర్‌ ఆఫర్‌.. సినీ ప్రేమికులకు గుడ్‌ న్యూస్‌

by Pulgam srinivas |

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ యూనిట్ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 499 రూపాయలకు, మల్టీప్లెక్స్‌లో 699 రూపాయలకు నాలుగు టికెట్లు మరియు ఒక పాప్‌కార్న్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

శివాజీ కొత్త సినిమాకి సూపర్‌ ఆఫర్‌.. సినీ ప్రేమికులకు గుడ్‌ న్యూస్‌
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వారిలో శివాజీ, లయ కూడా ఉంటారు. వీరిద్దరూ చాలా సంవత్సరాల తర్వాత సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే చిత్రంలో కలిసి నటించారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ నిర్మించాడు. ఈ సినిమాని మొదట ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అందుకు సంబంధించిన విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత సడన్గా ఈ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ మూవీని మార్చి 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. గత కొంతకాలంగా చిన్న సినిమాలకు టికెట్ రేట్లను తగ్గిస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. దానితో కంటెంట్ బాగున్న చిన్న సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

ఇక సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ బృందం కేవలం టికెట్ రేట్లను తగ్గించడం మాత్రమే కాకుండా మరో సూపర్ సాలిడ్ ఆఫర్ను కూడా అనౌన్స్ చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సింగల్ స్క్రీన్ ఉన్న థియేటర్లలో నలుగురు కలిసి టికెట్ తీసుకున్నట్లయితే 499 రూపాయలకే నాలుగు టికెట్లు మరియు ఒక పాప్‌కార్న్ ఇస్తామని, అదే మల్టీప్లెక్స్ థియేటర్లలో నలుగురికి పాప్‌కార్న్ తో కలిపి టికెట్ ధర కేవలం 699 రూపాయలే అని ప్రకటించారు. మరి ఈ ఆఫర్ ఈ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Next Story