అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సూపర్ న్యూస్.. అట్లీతో మూవీపై క్రేజీ అప్‌డేట్‌!

by Yella Dhawani Reddy |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సూపర్ న్యూస్.. అట్లీతో మూవీపై క్రేజీ అప్‌డేట్‌!
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్ ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకు విపరీతంగా హైప్‌ పెరుగుతోంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్‌ దశ పూర్తి చేసుకుంది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ ముంబయిలో ప్రారంభం కానుంది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌ లుక్‌, పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు, అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం.

తొలి షెడ్యూల్ అనంతరం యూనిట్‌ అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఓ ఇంటర్నేషనల్‌ లొకేషన్‌లో హై ఓక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కనుంది. అంతేకాదు, ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం దర్శకుడు అట్లీ హాలీవుడ్ నటీనటులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్‌లు ఈ చిత్రంలో నటించబోతున్నారని టీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించబోతోంది.

Next Story