Mass Jathara: 'మాస్ జాత‌ర' నుంచి సూప‌ర్ సాంగ్‌..ర‌వితేజ ఫ్యాన్స్ కు ఇక పండ‌గే

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 15:46:58  IST  )

'మాస్ జాత‌ర' నుంచి సూప‌ర్ సాంగ్‌.. సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమో ను తాజాగా రిలీజ్ చేశారు.

Mass Jathara: మాస్ జాత‌ర నుంచి సూప‌ర్ సాంగ్‌..ర‌వితేజ ఫ్యాన్స్ కు ఇక పండ‌గే
X

దిశ‌, వెబ్ డెస్క్ : మాస్ మహారాజ‌ రవితేజ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ అందుకోకపోయినా, కొత్త దర్శకులకు ఛాన్సులు ఇస్తూ ప్రయోగాలు చేస్తున్నారు రవితేజ. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాస్ జాతరతో ( Mass Jathara ) సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈనెల చివర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో సాలిడ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమో ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ లిరిక్స్ అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. ఇందులో హీరోయిన్ శ్రీ లీల అలాగే రవితేజ మాస్ స్టెప్పులతో ఇరగదీసినట్లు స్పష్టం అవుతుంది. ఇక ఈ పూర్తి పాటను అక్టోబర్ 22వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

Next Story