- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధురలో సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు
న్యూ ఇయర్ ఈవెంట్ కు నిర్వహించేందుకు రెడీ అయిన సన్నీలియోన్ కు ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: 2025కు గుడ్ బై చెప్పి.. 2026కు వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. ఇందుకోసం నటీనటులు, సింగర్లు, ఇతర కళాకారులతో ప్రజలను అలరించేందుకు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈవెంట్లు రెడీ అవుతున్నాయి. కానీ.. న్యూ ఇయర్ ఈవెంట్ కు నిర్వహించేందుకు రెడీ అయిన సన్నీలియోన్ కు ఊహించని షాక్ తగిలింది. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో ఆమె ఈవెంట్ రద్దయింది. స్థానిక సాదువులు, ఆధ్యాత్మిక సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో ఈవెంట్ ను రద్దు చేసుకుంటున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
జనవరి 1వతేదీన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ లో సన్నీలియోన్ తో మెగా ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. సన్నీలియోన్ తో డీజే నైట్ ఈవెంట్ కు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. కానీ.. శ్రీకృష్ణుడు పుట్టిన పవిత్రమైన గడ్డపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై స్థానిక హిందూ సంఘాలు, సాదువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భజనలు, కీర్తనలు, ప్రవచనాలు జరగాల్సిన చోట అశ్లీలతను ప్రోత్సహించేలా వేడుకలు జరపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ సహా పలు ధార్మిక సంస్థలు ఈ ఈవెంట్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేశారు. రద్దు చేయకపోతే ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో.. ఆ హోటల్ యాజమాన్యం దిగొచ్చింది. వారి మనోభావాలను గౌరవిస్తూ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.






