Sundeep Kishan: ఇది స్పై ఫిల్మే కాదు.. స్పై కామెడీ.. సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌లో రాబోతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’.

Sundeep Kishan: ఇది స్పై ఫిల్మే కాదు.. స్పై కామెడీ.. సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌లో రాబోతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా.. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసిన పీపుల్ స్టార్ సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌తో మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరితో కలిసి ఈ టీజర్‌ని సెలబ్రేట్ చేసుకోవడం వెరీ హ్యాపీ. టీజర్ నాకు చాలా నచ్చింది.

తను సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాలనే తపన నాకు చాలా నచ్చింది. ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్. మన ఆలోచనల్ని దేశం మొత్తం చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. ఫేమస్ అవ్వాలనుకుంటే రీల్స్ చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు. ఇది ఒక స్పై ఫిల్మే కాదు స్పై కామెడీ, సీరియస్ కామెడీ కూడా ఉంది. దర్శకుడు ఈ కథని నమ్మాడు. నమ్మింది చిత్రీకరించాడు నిహాల్ సూర్య వీళ్ళందరిలోనూ ఒక నిజాయితీ ఉంది. తప్పకుండా ఆ నిజాయితీని మనందరం అప్రిషియేట్ చేయాలి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా’ అన్నారు

Next Story