చరణ్ విషయంలో కథ కన్నా అదే ముఖ్యం అంటున్న సుకుమార్

by Pulgam srinivas |

చరణ్‌తో సినిమా విషయంలో కథ కన్నా పాత్ర రూపకల్పనకే సుకుమార్ ఎక్కువ ప్రాధాన్యత

చరణ్ విషయంలో కథ కన్నా అదే ముఖ్యం అంటున్న సుకుమార్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, మళ్లీ ఈ కాంబోలో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చరణ్ – సుకుమార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని సమాచారం. ముఖ్యంగా స్క్రిప్ట్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ స్టైల్ అంటే కేవలం కథ మాత్రమే కాదు, హీరో క్యారెక్టర్‌ను విభిన్నంగా డిజైన్ చేయడం. అదే విధంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌లో కూడా చరణ్ పాత్రను చాలా ప్రత్యేకంగా చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాత్ర రూపకల్పనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, తన టీమ్‌తో కలిసి డీటైల్డ్‌గా వర్క్ చేస్తున్నాడట. మొత్తానికి, “రంగస్థలం” తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. చరణ్‌కు ఇది మరో డిఫరెంట్ రోల్‌గా నిలుస్తుందా? సుకుమార్ మళ్లీ మ్యాజిక్ చేస్తాడా? అనేది చూడాలి.

Next Story