Hussain sha kiran: నాన్నకు ప్రేమతో సినిమాతోనే సుకుమార్ మారారు.

by Pulgam srinivas |

హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ... సుకుమార్ గారు మొదటినుండి లాజిక్స్ కంటే కూడా ఎమోషన్ మీదే ఆధారపడేవారని, ఎమోషన్స్ ఎక్కువ ఉండేలా కథ రాయమని సలహా ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు.

Hussain sha kiran: నాన్నకు ప్రేమతో సినిమాతోనే సుకుమార్ మారారు.
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తన దగ్గర పనిచేసే శిష్యులందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ దర్శకుడి దగ్గర పనిచేసిన వారిలో చాలామంది ఇప్పటికే డైరెక్టర్లుగా అద్భుతమైన స్థాయికి ఎదిగారు. తాజాగా శ్రీవిష్ణు హీరోగా రూపొందిన మృత్యుంజయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన హుస్సేన్ షా కిరణ్ కూడా సుకుమార్ దగ్గర పనిచేశారు. తాజాగా మృత్యుంజయ్ చిత్రం మార్చి 6వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

ప్రస్తుతం విజయవంతంగా ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయనను సుకుమార్ గారు ఇంటెలిజెంట్ మూవీలు చేస్తే అవి ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లకు మాత్రమే అర్థమవుతాయి అనే స్థాయి నుంచి పుష్ప మూవీతో భోజ్‌పురి, బీహార్ లాంటి ప్రాంతాల ప్రజలు కూడా ఆ సినిమాలను మెచ్చుకునే స్థాయికి ఆయన ఎలా మారారు? అని ప్రశ్నించారు. దానికి ఈ దర్శకుడు అది మారడం అని నేను అస్సలు అనుకోను, ఆ లక్షణం ఆయనలో మొదటి నుండి ఉంది.

నేను నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నప్పుడు లాజిక్స్ కంటే ఎమోషన్స్ మీద ఎక్కువగా రాయాలని ఆయన నాకు చెప్పేవారు అని సమాధానం ఇచ్చాడు. సుకుమార్ తన తదుపరి మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. ఆ మూవీ పూర్తికాగానే సుకుమార్, చరణ్ మూవీని స్టార్ట్ చేయనున్నారు.

Next Story