- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suhas: సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సుహాస్ (Suhas).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సందడి చేస్తున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సుహాస్ (Suhas).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సందడి చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama) ఒకటి. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మలయాళం బ్యూటీ మాళవిక మనోజ్ (Malavika Manoj) హీరోయిన్‌గా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుంది. దీనికి రామ్ గోధల దర్శకత్వం వహిస్తుండగా.. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు.
హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టీజర్, పాటలకు సోషల్ మీడియాలో మంచి స్పందన రాగా.. ఈ సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే జోష్‌లో సినిమా రిలీజ్ అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ‘ప్రేమ సినిమా లాంటిది.. సినిమా ప్రేమ లాంటిది. ఓ భామ అయ్యో రామ చిత్రం జూలై 11న థియేటర్లలో విడుదలవుతోంది’ అని చెప్పుకొస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సుహాస్ అండ్ మాళవిక సినిమా రీల్‌ను పట్టుకుని ఉన్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.






