- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త సినిమా ప్రకటించిన సుహాస్.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ హీరో సుహాస్ (suhas) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుహాస్ (suhas) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక 2020లో వచ్చిన ‘కలర్ ఫొటో’ (Colour Photo) సినిమాతో హీరోగా మారాడు. మొదటి మూవీతోనే హిట్ సాధించాడు. ఇక ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటూ పోతున్నాడు. ఒకే ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్న కథలతో వస్తూఅందరినీ మంత్రముగ్దులను చేస్తున్నారు. ఇక గత ఏడాది సుహస్ నటించిన గొర్రె పురాణం(Gorre Puranam), ప్రసన్న వదనం(Prasanna Vadanam), అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ వంటి మూవీస్ చేశాడు కానీ హిట్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం సుహాస్ ఓ సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ చిత్రం త్రిశూల్ విజనరీ బ్యానర్‌పై రాబోతున్న రెండో ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. గోపీ అట్చారా దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని నరేందర్ రెడ్డి(Narender Reddy) నిర్మిస్తున్నారు. అయితే ‘టీవీఎస్-2’ వర్కింగ్ టైటిల్ రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Trishul Visionary Studios announces their Production No. 2 - their debut in Telugu Cinema ✨
— BA Raju's Team (@baraju_SuperHit) March 31, 2025
Starring the supremely talented and loved @ActorSuhas in the lead role ❤🔥
Produced by #NarendraReddy under @TrishulVSoffl
Directed by @Gopiatchara
Written by @prasanthshanmuk#TVS02… pic.twitter.com/L6bbCpHSmD






