- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది.. టైటిల్‌తోనే ఫుల్ ఫన్
సుడిగాలి సుధీర్ తదుపరి చిత్రానికి ‘సుధీర్ జోకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటుడు, యాంకర్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు ‘సుధీర్ జోకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన మేకర్స్, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. టైటిల్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. విడుదలైన పోస్టర్‌లో సుడిగాలి సుధీర్ స్టైలిష్ అవతారంలో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. నోట్లో సిగరెట్, చేతిలో కార్డ్స్ పట్టుకుని భిన్నమైన లుక్‌లో కనిపించిన ఆయన పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పోస్టర్‌ను పరిశీలిస్తే ఈ చిత్రంలో కామెడీతో పాటు ఆసక్తికరమైన అంశాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి పీఎస్ సునీల్ పుప్పాల కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. అహ్మద్ షరీఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అయిషా ఇందులో హీరోయిన్గా కనిపించబోతుంది. ఇక ఈ చిత్రంతో సుడిగాలి సుధీర్ హీరోగా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.






