- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఆ రోజు సడెన్‌గా ఆమె ఆత్మ నా బాడీలో ప్రవేశించినట్లు అనిపించింది'.. ప్రభాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), లెజెండ్ యాక్టర్ కమల్ హాసన్(Kamal Haasan), రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మహానటి కీర్తి సురేష్(Keerthi suresh) వంటి స్టార్స్ యాక్ట్ చేశారు.
గతేడేది జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక దీపిక పదుకొణె కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రణవీర్ సింగ్(Ranveer Singh)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. ఇక వీరికి రీసెంట్‌గా ఒక పాప కూడా పుట్టింది. అయితే ఆ చిన్నారి ఫేస్‌ని మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఇదిలా ఉంటే.. రాణి పద్మావతి(Padmavathi) జీవితం ఆధారంగా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) తెరకెక్కించిన మూవీ ‘పద్మావత్’(Padmavath). బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, షాహిద్ కపూర్(Shahid Kapoor), దీపిక పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2018 లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.
ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు ‘ఘూమర్’ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో సినీ ప్రియులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. అయితే మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రం గురువారం రీ రిలీజ్(Re Release) అయి అంతే రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలో దీపిక పదుకుణె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లోనే అత్యంత కష్టతరమైన సాంగ్ ‘ఘూమర్’. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందే ఇందులోని నా రోల్ కోసం నేను సిద్ధమయ్యాను. కానీ, నేను ఫస్ట్ టైం పద్మావత్ సెట్‌లోకి అడుగుపెట్టింది మాత్రం ఈ సాంగ్ కోసమే.
ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. మొదటి షాట్ కోసం సెట్లోకి అడుగుపెట్టినప్పుడు సడెన్‌గా పద్మావత్ ఆత్మ నా శరీరంలోకి ప్రవేశించినట్లు అనిపించింది. ఆ అనుభూతి ఇప్పటికీ అలాగే ఉంది. దీని కోసం దాదాపు 30 కిలోల బరువున్న లెహంగా వేసుకుని డ్యాన్స్ చేశా. భారీ ఆభరణాలు, దుస్తులు ధరించడం కష్టమైనా.. ఎప్పుడూ వెనకడుగు వేయాలనిపించలేదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తతం దీపిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






