- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్టార్ హీరో గొప్ప మనసు.. మీకు ఎలా ధన్యవాదాలు తెలపాలో అర్థం కావడం లేదంటూ ప్రముఖ స్టంట్ మాస్టర్ పోస్ట్
పా. రంజిత్ డైరెక్షన్‌లో ఆర్య నటిస్తున్న ‘వేట్టువం’ మూవీ సెట్‌లో.. షూటింగ్ జరుగుతుండగా స్టంట్‌మ్యాన్ రాజు మృతి చెందిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: పా. రంజిత్ డైరెక్షన్‌లో ఆర్య నటిస్తున్న ‘వేట్టువం’ మూవీ సెట్‌లో.. షూటింగ్ జరుగుతుండగా స్టంట్‌మ్యాన్ రాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన విన్నా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చలించిపోయారు. దీంతో ఓ గొప్ప నిర్ణయం తీసుకుని అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ మేరకు అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలోని 650 మంది స్టంట్ మ్యాన్‌లకు తన సొంత డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించారు.
ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఆరోగ్య, ప్రమాద బీమా రెండూ ఉన్నాయి. స్టంట్ మ్యాన్ సెట్‌లో, బయట ఎక్కడైనా గాయపడితే రూ. 5 లక్షల వరకు బీమా పొందవచ్చు. అక్షయ్ కుమార్ చేసిన ఈ పనితో ప్రేక్షకులకు నువ్వు దేవుడువయ్యా అంటూ ప్రశంసిస్తున్నారు. దీనిపై బాలీవుడ్ ప్రముఖ స్టంట్ మాస్టర్ విక్రమ్‌సింగ్ స్పందిస్తూ.. ‘మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు చేసిన ఈ పని వల్ల బాలీవుడ్‌లో దాదాపు 650 నుంచి 700 బంది స్టంట్‌మ్యాన్‌లు, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు’ అని ధన్యవాదాలు తెలుపుకున్నారు.






