Hit-3: హిట్-3 నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్.. ఫుల్ కిక్ ఇచ్చిన నాని

by Chukka Sudharani |   (  Updated:2025-04-01 11:02:04  IST  )

నేచురల్ స్టార్ నాని (Nani), శైలేష్ కొలను కొంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హిట్-3’ (Hit-3).

Hit-3: హిట్-3 నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్.. ఫుల్ కిక్ ఇచ్చిన నాని
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani), శైలేష్ కొలను కొంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హిట్-3’ (Hit-3). హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా.. ఇప్పటికే ఇందులో నుంచి ప్రతి అప్‌డేట్ కూడా అంచనాలకు మించి ఉండటంతో.. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘హిట్-3’ నుంచి లేటెస్ట్‌గా ఓ పోస్టర్ (Poster) రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైల్డ్‌రైడ్‌కు ముందు ఎప్పుడూ ఫైర్ ఉంటుంది. మాస్ నేచురల్ స్టార్.. మాస్ రప్పా రప్పా మే 1న రాబోతుంది’ అంటూ రిలీజ్ చేసిన కౌంట్ డౌన్ (Count down) పోస్టర్‌లో నాని ఊరమాస్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. కాగా.. ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 1న రాబోతుంది.

Next Story