అఖండ 2 వివాదం...బాల‌య్య ఫ్యాన్స్ మ‌రో షాక్, ఇక క‌ష్టమేనా ?

by velandi.Saikiran |

డిసెంబర్ 12వ తేదీన ఈ అఖండ 2 సినిమాను రిలీజ్ చేస్తారని కొంతమంది ప్రచారం చేస్తుంటే, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న

అఖండ 2 వివాదం...బాల‌య్య ఫ్యాన్స్ మ‌రో షాక్, ఇక క‌ష్టమేనా ?
X

దిశ‌, వెబ్‌డెస్క్‌: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటికే అఖండ సినిమా వచ్చి ప్రభంజనం సృష్టించింది. దీంతో ఈ అఖండ 2 మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ లో కూడా మంచి ప్రమోషన్స్ చేశారు. కానీ రిలీజ్ సమయానికి ప్లాన్ బెడిసి కొట్టింది. కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల అఖండ 2 మూవీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

దీంతో కొత్త రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. డిసెంబర్ 12వ తేదీన ఈ అఖండ 2 సినిమాను రిలీజ్ చేస్తారని కొంతమంది ప్రచారం చేస్తుంటే, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ అవుతుందని మ‌రి కొంత‌మంది అంటున్నారు. అయితే అభిమానులు మాత్రం డిసెంబర్ 12వ తేదీన అఖండ 2 మూవీ రిలీజ్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారట. కానీ మేకర్స్ మాత్రం దానికి అస్సలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తే, మంచి కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తోందట చిత్ర బృందం. దీంతో ఈ రెండు తేదీలపైన తర్జనభర్జన పడుతున్నారు. మరి ఏ రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుందో చూడాలి.

Next Story