66 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ సింగర్.. తోడు కావాలంటూ బిగ్ షాకిచ్చాడుగా?

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తడంతో భాగస్వామికి దూరం అవుతున్నారు.

66 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ సింగర్.. తోడు కావాలంటూ బిగ్ షాకిచ్చాడుగా?
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తడంతో భాగస్వామికి దూరం అవుతున్నారు. పెళ్లయిన కొద్ది నెలలకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అయితే కొంతమంది పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ తమ భాగస్వామితో డైవర్స్ తీసుకుంటున్నారు. గత కొన్నేళ్ల నుంచి సెలబ్రిటీ విడాకులు ఓ ట్రెండ్‌గా మారాయి. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఫేమ్ గురించి ఆలోచించకుండా విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కొంతమంది రెండు పెళ్లిళ్లతో ఆగకుండా మూడో వివాహానికి కూడా సిద్ధమవుతున్నారు.

తాజాగా, ఓ స్టార్ సింగర్ ఏకంగా నాల్గవ పెళ్లిపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు వెల్లడించి అందరినీ షాక్‌కు గురి చేశారు. అతనెవరో కాదు.. సింగర్, పాటల రచయిత మక్సూద్ మహమూద్ అలీ(Maqsood Mahmood Ali)అలియాస్ (లక్కీ అలి) (66) ఇప్పటి వరకు మూడు వివాహాలు చేసుకుని విడిపోయారు. ఇక అప్పటినుంచి సింగిల్‌గా ఉన్న ఆయన ఇటీవల ఓ చిట్‌చాట్‌లో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో తోడు కావాలి అని చెప్పడంతో ఆయన నాలుగవ పెళ్లి చేసుకుంటాడని అంతా ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా బిగ్ షాకిచ్చాడుగా అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఆయన నాలుగో పెళ్లిపై వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా.. మక్సూద్, మేఘన జేన్‌ మెక్‌ క్లియరీ(Meghan Jane McCleary)ని 1996లో చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలువలేదు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక 2000 సంవత్సరంలో ఇనాయాను వివాహం చేసుకున్నాడు. ఆమెతోనూ లక్కీ అలీ ఇద్దరు పిల్లలను కన్నాక ఆమెతో విడాపోయాడు. చివరగా 2010లో బ్రిటిష్ మోడల్‌ కేట్ ఎలిజబెత్‌ హల్లమ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెతోనూ 2017లో ఎలిజబెత్‌ హల్లమ్‌ నుంచి అలీ విడాకులు తీసుకున్నాడు. విడాకుల సమయంలో వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారి ద్వారా ఐదుగురు సంతానంను పొందారు.

Next Story