- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kamal Haasan: కమల్ హాసన్ హగ్ చేసుకోవడంతో మూడు రోజులు స్నానం చేయని స్టార్ హీరో.. షాకింగ్ కామెంట్స్ వైరల్(వీడియో)
కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu), కమల్ హాసన్(Kamal Haasan) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’(Thuglife).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu), కమల్ హాసన్(Kamal Haasan) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’(Thuglife). మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఇందులో మూవీ టీమ్‌తో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు అతనిలో అన్నీ ఇష్టం. నేను ఎప్పుడూ కమల్ సినిమాలు మొదటి రోజు, మొదటి షోలోనే చూస్తాను.
అతను మా ఇంటికి వెళ్లి బెంగళూరులోని మా ఇంట్లో నాన్న డాక్టర్ రాజ్‌కుమార్‌తో మాట్లాడిన సమయం నాకు గుర్తుంది. ఆ సమయంలో, నాన్నగారిని నేనెవరు అని అడిగాడు. నాన్న నన్ను పరిచయం చేశాడు. నేను ఆయనను కౌగిలించుకోమని అడిగాను. ఆ తర్వాత నేను మూడు రోజులు స్నానం చేయలేదు. ఆ అనుభూతి, ఆయన వాసన అలాగే ఉండాలని నేను కోరుకున్నాను. కమల్ హాసన్‌కు నేను అలాంటి అభిమానిని. కమల్ సర్ సినిమాల నాణ్యత గురించి నేను చాలా మందితో గొడవ పడ్డాను. వాళ్ళు సినిమాల గురించి చెడు అభిప్రాయాలు చెప్పినా, నేను మంచి విషయాలే చెబుతాను.
కమల్ సర్ చికాగోలో ఉన్నారు, నాకు ఆయన నుండి ఫోన్ వచ్చింది. ఆయనతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సంభాషణ తర్వాత ఆయన, 'నీకు శివన్న తెలియదు, మీతో మాట్లాడిన తర్వాత నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి’ అని అన్నారు. ఆ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాన్న నాతో మాట్లాడుతున్నట్లు నాకు అనిపించింది. అది నాకు గౌరవంగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అవి చూసిన వారంతా షాక్ అవుతున్నారు.






