తండ్రి అయిన స్టార్ హీరో.. మా పెళ్లి రోజు నాడే పుట్టడం చాలా ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-22 11:59:32  IST  )

కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్(vishnu Vishal), గుత్తా జ్వాల(Gutta Jwala) దంపతులు తల్లిదండ్రులయ్యారు. వీరికి మంగళవారం కూతురు పుట్టింది.

తండ్రి అయిన స్టార్ హీరో.. మా పెళ్లి రోజు నాడే పుట్టడం చాలా ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్(vishnu Vishal), గుత్తా జ్వాల(Gutta Jwala) దంపతులు తల్లిదండ్రులయ్యారు. వీరికి మంగళవారం కూతురు పుట్టింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ ఎక్స్(X) ద్వారా తెలిపారు. ‘‘మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడు పాప పుట్టడం మరింత ఆనందంగా ఉంది. మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి’’ అని తెలుపుతూ ఎక్స్‌లో ఫొటో షేర్ చేశారు విష్ణు విశాల్. దీంతో ప్రముఖులతో పాటు నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా విష్ణు విశాల్‌, గుత్తా జ్వాల 2021 ఏప్రిల్‌ 22న వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సరిగ్గా నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డ పుట్టడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story