Ajith Kumar: స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మరోసారి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు(వీడియో)

by Yella Dhawani Reddy |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar)కు మరోసారి పెను ప్రమాదం తప్పింది.

Ajith Kumar: స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మరోసారి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar)కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. గత నెలలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేసు కోసం ప్రాక్టీసు చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా ఉన్న కారును తప్పించే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అజిత్‌ కారు ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ప్రమాదంలో హీరో తప్పు ఏమీ లేదని.. ఇతర కార్ల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అజిత్‌ రేసింగ్‌ టీమ్‌ తెలిపింది. ప్రమాదం జరిగిన కొంత సమయానికి ఆయన బయటకు వచ్చి.. అభిమానులతో ఫొటోలు దిగారు. రేస్‌ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసి అజిత్ అభిమానులు కలవరపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.

కాగా, హీరో అజిత్ కుమార్‌కు రేసింగ్ అంటే ఇష్టం. ఈ క్రమంలోనే 'అజిత్‌కుమార్‌ రేసింగ్‌' పేరుతో టీమ్‌ను సైతం ప్రకటించారు. దుబాయ్ రేసింగ్‌ ఈవెంట్‌లో ఆయన టీమ్‌ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఆయన సినిమాల విషయానికి వస్తే.. అధిక్‌ రవిచంద్రన్‌ డైరెక్షన్‌లో 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

Next Story