- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sivaji: శివాజీపై స్టార్ డైరెక్టర్ ప్రశంసలు.. నెట్టింట్ వైరల్‌గా మారిన ఫొటోలు
తెలుగు సినిమా పరిశ్రమలో తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ (Sivaji).

దిశ, సినిమా: తెలుగు సినిమా పరిశ్రమలో తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ (Sivaji). ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ (Court) సినిమాతో మరోసారి తన నటనా సత్తాను చాటాడు.. నాని (Nani) నిర్మాతగా, ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది. అలాగే ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రజెంట్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో శివాజీ పాత్ర అత్యంత కీలకమైనది కాగా, ఆయన నటనలోని సహజత్వం, భావోద్వేగ ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో సోషల్ మీడియాలో శివాజీ నటనకు ప్రశంసలు కురుస్తు్న్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కూడా ‘కోర్ట్’ సినిమాను వీక్షించి, శివాజీ నటనకు ఫిదా అయ్యారు. దీంతో శివాజీని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘కోర్ట్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శివాజీ, ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. ఆయన ‘దండోరా’ అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా, తన సొంత నిర్మాణంలో తాను హీరోగా లయ హీరోయిన్‌గా ఒక సినిమాను కూడా రూపొందిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా రెండు విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకోవడం శివాజీ విశేషం.






