ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్.. తెలంగాణ, ఏపీలో చిత్రీకరణతో

by Sujitha Rachapalli |

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘శ్రీనివాస మంగాపురం’తో హీరోగా లాంచ్ అవుతున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం

ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్.. తెలంగాణ, ఏపీలో చిత్రీకరణతో
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘శ్రీనివాస మంగాపురం’తో హీరోగా లాంచ్ అవుతున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ట్రేడ్ వర్గాలలో, ప్రేక్షకులలో భారీ బజ్‌ క్రియేట్ చేసింది. కాగా చిత్ర బృందం తాజాగా 30 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో 30% చిత్రీకరణ పూర్తి కాగా ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌తో చిత్ర బృందం చాలా హ్యాపీగా ఉంది. ఈ షెడ్యూల్‌లో మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కీలక సన్నివేశాలు, అద్భుతమైన పాటలు, ముఖ్యమైన టాకీ పార్ట్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. పూర్తి ఉత్సాహంతో ఉన్న చిత్ర బృందం త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది.

Next Story