- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీనివాస మంగాపురం టీజర్ అప్డేట్.. క్యూట్ పోస్టర్‌తో ఆకట్టుకుంటున్న టీమ్
జయకృష్ణ ఘట్టమనేని నటిస్తున్న‘శ్రీనివాస మంగాపురం’ టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరంగా ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని. ‘శ్రీనివాస మంగాపురం’ అనే క్రేజీ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి లేటెస్ట్‌గా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో నుంచి టీజర్ రాబోతుందని తెలుపుతూ.. ‘నిష్కల్మషత్వంలో పాతుకుపోయిన రెండు హృదయాలు.. తీవ్రతతో నిండిన ఒక గాథ.. శ్రీనివాస మంగాపురం టీజర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతున్నది.. ఆ ప్రపంచం ఆవిష్కృతమవడాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ క్యూట్ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా.. 'RX 100', 'మంగళవారం' వంటి సెన్సేషనల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కల్ట్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చందమామ కథలు వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన బ్యానర్‌పై ప్రఖ్యాత నిర్మాత అశ్వనీదత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా తడాని టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.






