ఆ తేదీన 'శ్రీనివాస మంగాపురం' రిలీజ్

by Pulgam srinivas |

‘శ్రీనివాస మంగాపురం’ చిత్రాన్ని జూలై 10న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

ఆ తేదీన శ్రీనివాస మంగాపురం రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 10న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని జెమిని కిరణ్ నిర్మిస్తుండగా, సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, అజయ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story