- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శ్రీనివాస మంగాపురం’ ఆడియో బ్లాస్ట్ కానుంది.. అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
“శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ అవుతుందని దర్శకుడు అజయ్ భూపతి ధీమా వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఘట్టమనేని జయకృష్ణ, రషా థడానీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “శ్రీనివాస మంగాపురం”. ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక ఈవెంట్‌ను మూవీ యూనిట్ నిన్న సాయంత్రం ‘Introducing Srinu & Manga’ పేరుతో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో హీరో, హీరోయిన్‌గా నటించిన ఇద్దరిని అధికారికంగా పరిచయం చేశారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి చిత్ర సంగీతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ... తన గత చిత్రం “ఆర్‌ఎక్స్ 100” మ్యూజిక్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలిసిందేనని, అలాగే “మంగళవారం” సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా విశేష గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. ఇక “శ్రీనివాస మంగాపురం” ఆడియో కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో చిత్ర సంగీతంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ చిత్రానికి జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత పి. కిరణ్ (జెమినీ కిరణ్) నిర్మిస్తున్నారు. అలాగే వైజయంతీ మూవీస్ అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు.






