బిగ్ బాస్ 9లో ఊహించని ట్విస్ట్..ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అంటే

by velandi.Saikiran |

తక్కువ ఓట్లు సాధించిన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ మేరకు అక్కినేని నాగార్జున అధికారిక ప్రకటన చేశారు

బిగ్ బాస్ 9లో ఊహించని ట్విస్ట్..ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అంటే
X

దిశ‌, వెబ్ డెస్క్: బిగ్ బాస్ 9 షో ( Bigg Boss 9) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో కొంతమంది ఎలిమినేట్ కాగా మరి కొంతమంది డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఇవాళ మరో కంటేస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. అది ఎవరో కాదు సాయి శ్రీనివాస్. ఈ వారం నామినేషన్స్ లో సంజన, తనూజ, సుమన్ శెట్టి, రాము, కళ్యాణ్, భరణి తో పాటు సాయి శ్రీనివాస్ ఉన్నారు. అయితే ఈ నామినేషన్స్ లో భరణితో పాటు సాయి శ్రీనివాస్ ( Sreenivasa Sai) మధ్య చాలా గట్టిపోతే జరిగింది. నువ్వా నేనా అన్న రేంజ్ లో తలపడ్డారు.

కానీ ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం, తక్కువ ఓట్లు సాధించిన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ మేరకు అక్కినేని నాగార్జున అధికారిక ప్రకటన చేశారు. అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ ( Bigg Boss 9 elimination) అయిన సందర్భంగా గోల్డెన్ బటన్ ఉపయోగించి, అతన్ని వెనక్కి తీసుకువచ్చే అవకాశాన్ని తనుజా ఉపయోగించుకోలేదు. ప్రేక్షకుల తీర్పు మేరకు సాయి శ్రీనివాస్ ను ఎలిమినేట్ చేయాల్సిందేనని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.

Next Story