ఆ కుర్రాడి బుట్ట‌లో ప‌డిన శ్రీలీల..క్రేజీ వీడియో ఇదిగో !

by velandi.Saikiran |   (  Updated:2026-01-03 13:47:17  IST  )

ఓ ప్రముఖ గుడికి వెళ్లారు శ్రీలీల. ఈ సందర్భంగా క్యూ లైన్ లో నిల్చున్న శ్రీలీల.. అక్కడే ఉన్న ఓ కుర్రాడిని చూసింది.

ఆ కుర్రాడి బుట్ట‌లో ప‌డిన శ్రీలీల..క్రేజీ వీడియో ఇదిగో !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ( Sreeleela) గురించి ఎంత చెప్పినంత తక్కువ అవుతుంది. 2019 సంవత్సరంలో కిస్ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందాల తార... తెలుగులో పెళ్లి సందడి సినిమాతో సందడి చేసింది. ఆ తర్వాత ధమాకా లాంటి సినిమా చేసి వరుసగా అగ్ర హీరోల సరసన చేసింది శ్రీ లీల. రష్మిక తరహాలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఛాన్స్ వస్తే ఐటమ్ సాంగ్ కూడా చేస్తోంది. అయితే అలాంటి హీరోయిన్ శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

కొత్త సంవత్సరం నేపథ్యంలో ఓ ప్రముఖ గుడికి వెళ్లారు హీరోయిన్ శ్రీలీల. ఈ సందర్భంగా క్యూ లైన్ లో నిల్చున్న హీరోయిన్ శ్రీలీల.. అక్కడే ఉన్న ఓ కుర్రాడిని చూసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. అయితే ఆ క్యూ లైన్ లో ఉన్న కుర్రాడు చాలా అందంగా ఉండడంతో శ్రీలీల చూసినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అతడికి పూర్తిగా ఫ్లాట్ అయిందని అంటున్నారు. అయితే ఆమె క్యాజువల్ గా అటు వైపు చూసిందని మరికొంతమంది శ్రీలీలను సపోర్ట్ చేస్తున్నారు.

Next Story