- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్పిరిట్’ షూటింగ్ అప్‌డేట్
ప్రస్తుతం స్పిరిట్ మూవీ షెడ్యూల్ హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్‌లో జరుగుతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “స్పిరిట్ ” చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎప్పుడూ నటించలేదు. అలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగా వంటి స్టార్ దర్శకుడి చిత్రంలో ఆయన పోలీస్ యూనిఫామ్ ధరించడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా చిత్ర బృందం ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి నటిస్తోంది. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు..ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






