Spirit: ప్రభాస్‌తో రొమాన్స్ చేయబోతున్న మెగా బ్యూటీ .. ట్వీట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-01-21 08:11:00  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ‘స్పిరిట్’(Spirit) ఒకటి.

Spirit: ప్రభాస్‌తో రొమాన్స్ చేయబోతున్న మెగా బ్యూటీ .. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ‘స్పిరిట్’(Spirit) ఒకటి. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తుండగా.. టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేశారు. అయితే.. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీలో డార్లింగ్ సరసన యంగ్ బ్యూటీ రాశి ఖన్నా(Rashi Khanna) హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే కీ రోల్‌లో సైఫ్ అలీఖాన్(Saif ALi Khan), కరీనా కపూర్(Kareena Kapoor) కనిపించనున్నట్లు ఇన్‌సైడ్ వర్గాల టాక్. ఇక రాశి ఖన్నా నటిస్తోంది అని తెలియగానే ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ న్యూస్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story