- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Spirit: స్పిరిట్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్..రంగంలోకి ఆ నటుడు !
ప్రభాస్ హీరోగా చేస్తుండగా, త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా మెరువనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న ఈ

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే ది రాజాసాబ్ తో వచ్చే సంక్రాంతి వస్తోన్న ప్రభాస్, అటు స్పిరిట్ షూటింగ్ లో బిజీ ఉన్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా, త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా మెరువనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు వివేక్ ఒబెరాయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.
భూషణ్ కుమార్, భద్రకాళి పిశ్చర్స్ బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ ప్రారంభంలోనే షూరు అయింది. అయితే, తాజాగా ప్రభాస్ జపాన్ టూర్ వెళ్లిన తరుణంలో, షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ డిసెంబర్ 3వ వారంలో మళ్లీ స్పిరిట్ షూటింగ్ పునః ప్రారంభం కానుందట. ఆ సందర్భంగా ప్రకాష్ రాజ్ కు సంబంధించిన పోర్షన్ ఫినీష్ చేయనున్నారట సందీప్ రెడ్డి వంగా. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్, ప్రభాస్ మధ్య చాలా కీలకమైన సన్నివేశాలు ఉంటాయని టాక్. వాటిని ఈ నెల చివరలోపు పూర్తి చేయనున్నారట.






