Rajinikanth: సంక్రాంతికి రజినీకాంత్ ‘జైలర్-2’ నుంచి అదిరిపోయే అప్డేట్!

by Mallepaka Hamsa |

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి అదే ఫామ్‌తో దూసుకుపోతున్నారు.

Rajinikanth: సంక్రాంతికి రజినీకాంత్ ‘జైలర్-2’ నుంచి అదిరిపోయే అప్డేట్!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి అదే ఫామ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) కాంబోలో ‘జైలర్-2’ (Jailer-2)మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ జైలర్‌కు సిక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే దీనిని సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్‌పై కళానిధి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైపోయింది. కానీ ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఓ న్యూస్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతూ అందరి సంతోషానికి కారణమవుతోంది. సంక్రాంతికి ‘జైలర్-2’ నుంచి స్పెషల్ గ్లింప్స్(Special Glimpses) విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అది చూసిన వారంతా ఆనందపడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Next Story