- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫ్రికాలో విహరిస్తోన్న సౌత్ మోస్ట్ లవబుల్ కపుల్.. నెట్టింట వీడియో వైరల్
సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ సూర్య (Surya), జ్యోతిక (Jyothika) సినిమాల నుంచి ఏమాత్రం విరామం దొరికినా, కుటుంబంతో

దిశ, వెబ్ డెస్క్: సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ సూర్య (Surya), జ్యోతిక (Jyothika) సినిమాల నుంచి ఏమాత్రం విరామం దొరికినా, కుటుంబంతో సమయం గడిపేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలో తాజాగా ఈ స్టార్ జంట తూర్పు ఆఫ్రికాలోని అందాల దీవి సీషెల్స్‌లో విహరిస్తోన్నారు. అక్కడి సముద్రం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కాగా, సూర్య ఇటీవల నటించిన కంగువా, రెట్రో రెండు సినిమాలు మిశ్రమ స్పందనలకే పరిమితం అయ్యాయి. దీంతో రాబోయే సినిమాపై సూర్య దృష్టిపెట్టారు. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్(Raveena Tandon), రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పులో కూడా సూర్య నటిస్తున్నారు.






