- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరు, వెంకీ మామ డ్యాన్స్ స్టెప్స్ అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మాసివ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మాసివ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోగా.. ఎనర్జీతో నిండిన ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డాన్స్ పోజుల్లో అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు. ఈ సాంగ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్‌గా మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేయబోతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా స్టార్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ సాంగ్. కాగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.






