- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మజాకా నుంచి ‘సొమ్మసిల్లిపొతున్నవే ఓ సిన్నా రాములమ్మా’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan), యంగ్ బ్యూటీ రీతూ వర్మ(Ritu Varma) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’(Mazaka). స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinatharao Nakkina) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రావు రమేష్(Rao Ramesh), అన్షు(Anshu) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఎ కె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండ(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
అయితే మజాకా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కాగా ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయింది. అయితే విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో పాటు వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ అనే సాంగ్ ఈరోజు సాయంత్రం 6 గంటల 3నిమిషాలకు రిలీజ్ కానున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






