- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి సాలిడ్ అప్డేట్.. వావ్ , సూపర్ ప్లాన్ అదిరిపోయిందంటున్న నెటిజన్లు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(peddi). బుచ్చిబాబు సనా(Buchibabu Sana) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(peddi). బుచ్చిబాబు సనా(Buchibabu Sana) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar), దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇది రామ్ చరణ్ 16వ చిత్రంగా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలై.. ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ కూడా విడుదలై మంచి రెస్సాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఇందులోని రామ్ చరణ్ లుక్ మాత్రం అదిరిపోయిందని అంతా చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి విడుదలయ్యే ప్రతి అప్డేట్ఊహించని విధంగా సోషల్ మీడియాను షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, రామ్ చరణ్ ‘పెద్ది’కి సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ మౌలాలి రైల్వే స్టేషన్‌లో జగపతి బాబు, రామ్ చరణ్ మధ్య ఉన్న సీన్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో కమెడియన్ సత్య కూడా భాగం కాబోతున్నారట. ఇక ఈ సీన్స్ ‘పెద్ది’ సినిమాకే హైలెట్‌గా నిలవబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వావ్, సూపర్ బుచ్చిబాబు ప్లాన్ అదిరిపోయింది వీరిద్దరి మధ్య సీన్స్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అని అంటున్నారు.






