- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sivaji: 90's వెబ్ సిరీస్ ఫేమస్ డైలాగ్‌తో శివాజీ కొత్త సినిమా.. టైటిల్ పోస్టర్ వైరల్
వింటేజ్ మోస్ట్ పాపులర్ కపుల్ శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: వింటేజ్ మోస్ట్ పాపులర్ కపుల్ శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. SSS ప్రొడక్షన్ నంబర్.2గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన & దర్శకత్వం వహిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈటీవీ విన్ కూడా ఇందులో నిర్మాణంలో భాగం అయినట్లు తెలుపుతూ.. శివాజీ పాత్రను రివీల్ చేశారు. శివాజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా టైటిల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాకు ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు తెలిపారు. సూపర్ హిట్ అందున్న 90's వెబ్ సిరీస్ డైలాగ్ ఈ సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేయడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ప్రజెంట్ ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. Link






