Sivaji: 'మంత్ర'లో చార్మి 15 నిమిషాలే ఉంటుంది.. అది నా సినిమా

by Pulgam srinivas |

తాజాగా శివాజీ మాట్లాడుతూ... మంత్ర సినిమాలో ఛార్మి పాత్ర 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది, అందులో నేనే ఎక్కువ కనబడతాను, అది నా సినిమా అని శివాజీ తాజాగా చెప్పుకొచ్చారు.

Sivaji: మంత్రలో చార్మి 15 నిమిషాలే ఉంటుంది.. అది నా సినిమా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు శివాజీ తాజాగా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో లయ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈరోజు అనగా మార్చి 6వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మొదటగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

ఈ సినిమా విడుదల సందర్భంగా శివాజీ వరుసగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా ఈయన తెలియజేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మీరు చాలా సంవత్సరాల క్రితం చార్మి ప్రధాన పాత్రలో రూపొందిన 'మంత్ర'లో నటించారు కదా? అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన చార్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా కాదు, అది నా సినిమా. అందులో చార్మి పాత్ర కేవలం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది.

సినిమాలో మొత్తం నేనే కనబడతాను. ఆ సినిమా విడుదలకు ముందు ఆ మూవీ యూనిట్ వారు నా పాత్రను పెద్దగా ఫోకస్ కాకుండా చూడాలనుకున్నారు, అది సక్సెస్ అయ్యింది. ఇక మంత్ర సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలో హర్రర్ ప్లస్ కామెడీని మిక్స్ చేశారు. ఆ సినిమా కంటే ముందు ఆ జోనర్ లో తెలుగులో ఒక్క సినిమా కూడా రాలేదు. అప్పట్లో మంత్ర చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది అని శివాజీ తాజాగా చెప్పుకొచ్చాడు.

Next Story