- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sivaji : పంచాయతీ కార్యదర్శిగా నటుడు శివాజీ.. నిజాయితీకి ప్రతిరూపం అంటూ పోస్ట్ వైరల్
90's వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి హీరో శివాజీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు.

దిశ, సినిమా: 90's వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి హీరో శివాజీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక ఇటీవల కోర్టుతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోగా.. ప్రజెంట్ నిర్మాతగా మారి మరో చిత్రానికి సిద్ధం అయ్యాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందబోతున్న ఈ చిత్రంలో.. శివాజీ హీరోగా నటిస్తుండగా.. సీనియర్ బ్యూటీ లయ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. పూజాకార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.
SSS ప్రొడక్షన్ నంబర్.2గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన & దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇందులో నుంచి మరో అప్డేట్ వచ్చింది. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈటీవీ విన్ కూడా ఇందులో నిర్మాణంలో భాగం అయినట్లు తెలుపుతూ.. శివాజీ పాత్రను రివీల్ చేశారు. ‘నిజాయితీకి ప్రతిరూపం.. నటుడు శివాజీ పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్‌గా రాబోతున్నాడు.. ఈటీవి విన్ & శివాజీల కాంబోలో మరో అందమైన మ్యాజిక్ కథ రూపొందుతోంది’ అని తెలిపారు. అలాగే.. త్వరలో టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. లింక్






