Sivaji : కోర్ట్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి శివాజీ.. ఏకంగా ఎన్ని సినిమాలంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-05-22 15:57:08  IST  )

సీనియర్ నటుడు శివాజీ (Shivaji) ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తన నటనా ప్రతిభను మరోసారి ఫ్రూవ్ చేసుకుంటున్నాడు.

Sivaji : కోర్ట్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి శివాజీ.. ఏకంగా ఎన్ని సినిమాలంటే?
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు శివాజీ (Shivaji) ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తన నటనా ప్రతిభను మరోసారి ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 90s సిరీస్‌ (90s series)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ.. తాజాగా ‘కోర్ట్’ చిత్రంతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ మార్చి 14న వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మంగపతిగా శివాజీ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో.. ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కేశాడు శివాజీ. కోర్ట్‌తో వచ్చిన క్రేజ్‌తో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శివాజీ సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింట్ న్యూస్ వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం 8 సినిమాల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా.. నిర్మాతగా 3 సినిమాల్ని పట్టాలు ఎక్కించారు. అందులో ఒక సినిమాకు ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ సినిమాలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story