- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐ-బొమ్మ రవి టాలెంట్ సూపర్.. దేశానికి పనికొస్తాడు !
శివాజీ మాట్లాడుతూ, ఐ బొమ్మ ఇమ్మడి రవిని, అతని టాలెంట్ ను తెగ మెచ్చుకున్నారు. సినిమాలు జనాలకు అందించి అతడు

దిశ, వెబ్ డెస్క్: ఐ-బొమ్మ నిర్వాహకుడు రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ. ఇమ్మడి రవి చాలా తెలివైన వ్యక్తి అని, అతన్ని మంచి మార్గంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియాకు ఇలాంటి ప్రతిభావంతులు అవసరమంటూ వ్యాఖ్యానించారు. ఐ బొమ్మ రవి చేసింది తప్పే కావచ్చు, కానీ అతనిలో సూపర్ టాలెంట్ ఉందంటూ వ్యాఖ్యానించారు. దండోరా సినిమాలో ప్రత్యేక పాత్రలో శివాజీ నటించారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ, ఐ బొమ్మ ఇమ్మడి రవిని, అతని టాలెంట్ ను తెగ మెచ్చుకున్నారు. సినిమాలు జనాలకు అందించి అతడు సంతోషపడ్డాడు, కానీ రవి చేసిన పని వల్ల ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడిందని వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం రవి నడిస్తే, బాగుండేదని తెలిపారు. ఇప్పటికైనా రవిలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు శివాజీ స్పష్టం చేశారు. కానీ రవిని ఇండియా బాగు కోసం వాడుకోవాలని సూచనలు చేశారు. సినిమాను మొబైల్ లో కంటే థియేటర్లో చూస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. సినిమాలు బతికించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు శివాజీ. క్లిక్






