- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం!!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఒడిశా సినిమా రంగానికి అపారమైన సేవలు అందించిన సింగర్ హ్యూమాన్ సాగర్ 36 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. AIIMS భువనేశ్వర్‌లో మూడు రోజులుగా చికిత్స

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఒడిశా సినిమా రంగానికి అపారమైన సేవలు అందించిన సింగర్ హ్యూమాన్ సాగర్ 36 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. AIIMS భువనేశ్వర్‌లో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన... బైలటరల్ న్యుమోనియా, యాక్యూట్ లివర్ ఫెయిల్యూర్, డైలేటెడ్ కార్డియోమయోపతి, మల్టీ-ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ వంటి తీవ్ర సమస్యలతో పోరాడుతూ సోమవారం రాత్రి 9:08 గంటలకు మరణించారు. అత్యంత అధునాతన చికిత్స అందించిన ఆయన బాడీ స్పందించలేదని ఆస్పత్రి అధికారిక ప్రకటన చేసింది. ఆయన మరణాన్ని ధృవీకరించింది.
బలసోర్‌లో సాధారణ కుటుంబంలో జన్మించిన సాగర్.. ఓడియా ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రసిద్ధి చెందాడు. ‘సిందూర’, ‘ఇష్ఖ్ హువా’, ‘బిన్ బలా’ వంటి హిట్ సాంగ్స్‌తో జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు. ఫోక్, కాంటెంపరరీ స్టైల్ మిక్స్ చేసే ఆయన దాదాపు 100కుపైగా పాటలు పాడాడు. కాగా ఆయన మరణవార్తపై స్పందించిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్హీ.. ‘సంగీతం, చిత్రపరిశ్రమకు అపూర్వ నష్టం’గా వర్ణించారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, కళాకారులు ఆయన పాటలు, పెర్ఫార్మెన్స్‌లు షేర్ చేస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






