పాము స్పెర్మ్ కాక్ టెయిల్ తాగుతున్న గాయని

by Naveena |

ఒక పాట ఎన్నో టెన్షన్ల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎన్నో బాధలను మర్చిపోయేలా చేస్తుంది.

పాము స్పెర్మ్ కాక్ టెయిల్ తాగుతున్న గాయని
X

దిశ, వెబ్ డెస్క్: ఒక పాట ఎన్నో టెన్షన్ల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎన్నో బాధలను మర్చిపోయేలా చేస్తుంది. టాబ్లెట్లు, మందులు ఇవ్వలేని రిలీఫ్ ను ఒక మంచి మెలోడీ సాంగ్ ఇవ్వడం మనం నేరుగా చూడకపోయినా, సినిమాల్లో చూస్తుంటాం. వినడం సులువే.. కానీ పాటను అంత వినసోంపుగా పాడటమే కష్టం. అయితే.. జనాలకి నచ్చేలా పాటలు పాడేందుకు సింగర్లు కూడా తెగ కష్టపడిపోతుంటారు. వారి గొంతులకు రెస్ట్ ఇవ్వకుండా సాధన చేస్తుంటారు. గొంతుకు సంభందించిన ఆసనాలతో పాటు ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు చేస్తుంటారు. కానీ ఓ అమెరికన్ సింగర్ మాత్రం అందరినీ షాక్ కు గురి చేసేలా పాము స్పెర్మ్ తాగుతూ గొంతును అద్భుతంగా మార్చుకుంటుందట.

ఈ విషయాన్ని స్వయంగా ఆ సింగర్(జెస్సికా సింప్సన్) తెలిపింది. సోషల్ మీడియా వేదికగా(ఇంస్టాగ్రామ్) చెప్పుకొచ్చింది. అది చైనీస్ మూలిక లాగా ఉంటుంది. అదేంటో చెప్పకుండా నా సింగింగ్ కోచ్ తాగాలని చెప్పాడు. ఆ తర్వాత నిజంగా నా స్వరంలో చాలా మార్పులు కనిపించాయి అంటూ ఆ సింగర్ నెట్టింట్లో పేర్కొన్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది గమనించిన ఇండియాలో ప్రముఖ గాయకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Next Story