- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వీళ్లంతా ఎప్పుడు చస్తరో'.. ప్రముఖ సింగర్ షాకింగ్ పోస్ట్...
ప్రముఖ సింగర్ చిన్మయి కెరీర్‌లో ఎన్నో ఫేస్ చేసింది. వైర ముత్తు లాంటి వ్యక్తులపై మీ టూ అలిగేషన్స్ చేసి తమిళ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయింది. కానీ తన పోరాటం మాత్రం ఆపలేదు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. నా పోరాటం ఆగదని స్పష్టం చేస్తూనే ఉంది.

దిశ, వెబ్‌సైట్ : ప్రముఖ సింగర్ చిన్మయి కెరీర్‌లో ఎన్నో ఫేస్ చేసింది. వైర ముత్తు లాంటి వ్యక్తులపై మీ టూ అలిగేషన్స్ చేసి తమిళ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయింది. కానీ తన పోరాటం మాత్రం ఆపలేదు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. నా పోరాటం ఆగదని స్పష్టం చేస్తూనే ఉంది. సింగిల్ పేరెంట్ చేతుల్లో పెరిగిన ఆమె ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కోగా.. ఇతరులకు ఇలాంటి ఇబ్బందులొచ్చినా తన పూర్తి మద్దతు అందిస్తుంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలో 15ఏళ్ల మైనర్ బాలికపై రెండేళ్లుగా 14 మంది గ్యాంగ్ రేప్ జరుగుతుందన్న వార్తపై ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వెధవలు ఎందుకు పుట్టారో తెలియదు కానీ ఎప్పుడు చస్తరో అంటూ పోస్టు పెట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. ‘నేను ఈ విషయాన్ని భరించలేకపోతున్నా. ఆంధ్రలో 14 మంది రెండేళ్లుగా ఓ 15ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నరు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. అంటే ఇక్కడ అమ్మాయిలకు టూ మచ్ రైట్స్ ఉన్నట్లు.. అబ్బాయిలో డేంజర్‌లో ఉన్నట్లా? ఈ రేపిస్టులను కాల్చి బూడిదగా మార్చేయాలి. గ్యాంగ్ రేప్ న్యూ కల్చర్ అయిపోయింది. ఎందుకు పుట్టారో తెలియదు కానీ వీళ్లందరు ఎప్పుడు చస్తరో’ అంటూ పోస్ట్ పెట్టింది.






