Siddhu Jonnalagadda: అదే నా స్ట్రాంగ్ ఫీలింగ్.. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ ప్రమోషన్స్‌లో సిద్ధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) రొమాంటిక్ కామెడీ మూవీ ‘కృష్ణ అండ్ హిస్ లీల’

Siddhu Jonnalagadda: అదే నా స్ట్రాంగ్ ఫీలింగ్.. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ ప్రమోషన్స్‌లో సిద్ధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) రొమాంటిక్ కామెడీ మూవీ ‘కృష్ణ అండ్ హిస్ లీల’ (Krishna and His Leela) ఇప్పుడు థియేటర్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్‌లో‌ మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ (Its Complicated) అనే కొత్త టైటిల్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ కొత్త టైటిల్, ప్రమోషన్స్ మరింత ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఇందులో భాగంగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘సినిమాని థియేటర్స్‌లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫిబ్రవరి 14 సినిమాకి యాప్ట్ రిలీజ్. థియేటర్స్‌లో ఆడియన్స్ ఎక్జైట్మెంట్ చూడాలని ఉంది’ అన్నారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ.. ‘నాకు సిద్దు రవికాంత్‌తో మరో సినిమా చేయాలని ఉండేది. ఇది రిలీజ్ చేస్తేగానీ మరో సినిమా చేయనని అన్నారు. దీనికి ఫిబ్రవరి 14 రైట్ డేట్. ఇది రీరిలీజ్ కాదు. థియేటర్స్‌లో ఫస్ట్ టైం రిలీజ్’ అని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ రవికాంత్ పెరెపు (Ravikant Perepu) మాట్లాడుతూ.. ‘లాక్ డౌన్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో చూడటం కుదరలేదు. అందరితో కలసి చూస్తే మజా వస్తుంది. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం’ అని తెలిపారు.

Next Story