Siddu Jonnalagadda: బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో సిద్ధు జొన్నలగడ్డ.. ఆగిపోయిన సినిమా డైరెక్టర్‌తో మరోటి

by Chukka Sudharani |

Siddu Jonnalagadda: బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో సిద్ధు జొన్నలగడ్డ.. ఆగిపోయిన సినిమా డైరెక్టర్‌తో మరోటి
X

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నల గడ్డ.. తాజాగా ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్‌లో రన్ అవుతుండగా.. తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. అందులో ‘కోహినూర్’ ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుండగా.. దీనికి రవికాంత్ పెరెపు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ మూవీని 2024లో ప్రకటించగా.. అందులో నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా మరో అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా వాయిదా పడి.. దాని స్థానంలో ‘బాదాస్’ తెరకెక్కబోతున్నది. దీనికి డైరెక్టర్ రవికాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నాడు సిద్ధు. దీని అనంతరం టిల్లుక్యూబ్‌లో నటించబోతున్నట్లు టాక్.

Next Story