Shubham Teaser: ‘శుభం’ టీజర్ వచ్చేస్తుంది.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |

స్టార్ హీరోయిన్ సమంత(SAMANTHA) మయోసైటిస్(Myositis) వ్యాధి బారిన పడి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

Shubham Teaser: ‘శుభం’ టీజర్ వచ్చేస్తుంది.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(SAMANTHA) మయోసైటిస్(Myositis) వ్యాధి బారిన పడి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అలా ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ రీసెంట్‌గా ‘సిటాటెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటించాడు. అయితే ఈ సిరీస్‌లో సమంత తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం సామ్.. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’(Shubham) చిత్రీకరణ విజయవంతంగా పూరైంది. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్‌ ఇచ్చేలా ఈ చిత్రంలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠెం, చరణ్ పెరి, షాలిని కొండెపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

వసంత్ మరిగంటి(Vasanth Mariganti) రాసిన ఈ కథను ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఇచ్చింది సమంత. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెడుతూ.. శుభం టీజర్(Teaser) ఈరోజు రాబోతుంది. టీజర్ కోసం సబ్‌స్క్రై(Subscribe) చేసుకోండి అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టైం ప్రకటించకపోవడం గమనార్హం.


Next Story