శృతి హాసన్ ఎంట్రీతో మరింత హైప్!

by Chukka Sudharani |

అనన్య పాండే నటిస్తున్న ‘కాల్ మీ బే’ సిరీస్ సీజన్ 2లో శృతి హాసన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

శృతి హాసన్ ఎంట్రీతో మరింత హైప్!
X

దిశ, సినిమా: అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’. 2024 లో వచ్చిన ఈ సిరీస్‌ను కొలిన్ డికన్హా తెరకెక్కించగా.. గుర్ఫతే పిర్జాదా, విహాన్ సమత్, విర్ దాస్, మినీ మాథుర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక ధనవంతురాలిగా జీవించిన బే, తన విలాసవంతమైన జీవితాన్ని కోల్పోయి, ముంబైలో తనకంటూ ఒక గుర్తింపును ఎలా సంపాదించుకుంది అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హందీలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, మలయాళం కూడా డబ్ చేయబడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కాల్ మీ బే సూపర్ సక్సెస్ కావడంతో.. అమెజాన్ ప్రైమ్ వీడియో సీజన్ 2 కూడా ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ప్రజెంట్ ఈ సిరీస్‌కు సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తుండగా.. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లోకి హీరోయిన్ శృతి హాసన్ భాగం అయినట్లు తెలుస్తోంది. ఇందులో శృతి ఒక కీలక పాత్రలో కనిపించనుందని టాక్. దీంతో ఈ సిరీస్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. కాగా.. ఈ కొత్త సీజన్ మరింత డ్రామా, హాస్యంతో పాటు ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతుండగా ఇందులో పలువురు నటీనటులు భాగం కాబోతారని టాక్.

Next Story