- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెట్టింట వైరల్ అవుతున్న శ్రీయ శరణ్ మొబైల్ నెంబర్.. అసలు ఈ మూర్ఖుడు ఎవరంటూ హీరోయిన్ సంచలన పోస్ట్
అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీయ శరణ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీయ శరణ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే ఈ చిన్నది స్టార్ డమ్ అందుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. రీసెంట్‌గా తేజ సజ్జా నటించిన ‘మిరాయ్‘ మూవీతో మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోకు తల్లిగా నటించి మెప్పించింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఫ్యామిలీతో వేకెషన్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నది ఇన్‌స్టాలో ఓ సంచలన పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో శ్రీయ శరణ్ డిస్‌ప్లే ఫొటోతో మొబైల్ నెంబర్ కనిపిస్తుంది.
ఇక ఆ నెంబర్‌ను శ్రీయ షేర్ చేస్తూ.. ‘అసలు ఈ మూర్ఖుడు ఎవరు.. దయచేసి ప్రజలకు టైమ్ వేస్ట్ చేసే ఇలాంటి పనులు చేయడం ఆపండి.. దురదృష్టవశాత్తు ఇది వింతగా ఉంది. ప్రజల సమయాన్ని వృధా చేయడం నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఇది నేను కాదు! నా నంబర్ కాదు! ఇంకో విషయం ఏమిటంటే, ఈ చెత్త వ్యక్తి నేను ఆరాధించే మరియు పని చేయడానికి ఇష్టపడే వ్యక్తులను చేరుకుంటున్నాడు. అది నాకు చాలా వింతగా ఉంది. ఇలా చేయడానికి మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు? ఒకరి అనుకరణదారుడిగా కాకుండా, మంచి జీవితం కోసం శ్రమించండి’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు పోలీస్ స్టేషన్‌లో కంప్లైట్ ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






