- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kaliyugam 2064: 2064 లో ఏం జరగబోతుంది.. గూస్‌బంప్స్ తెప్పిస్తు్న్న కలియుగమ్-2064 ట్రైలర్
‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath).

దిశ, సినిమా: ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath). గత ఏడాది ‘సైంధవ్’, ‘డాకు మహారాజ్’ వంటి మూవీతో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న ఈమె.. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘కలియుగమ్-2064’ (Kaliyugam 2064) ఒకటి. అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని ప్రమోద్ సుందర్ (Pramood Sunder) దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్‌కె ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కెఎస్ రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకురాబోతున్నారు. ఇందులో కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల మే-9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘కలియుగమ్-2064’ ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ స్టార్టింగ్‌లోనే దెబ్బలతో ఉన్న శ్రద్దా శ్రీనాథ్ కనిపించగా.. ‘భయంతో, ఆకలితో చద్దామా.. లేదంటే పోరాడి చద్దామా.. అది మన చేతిలోనే ఉంది’ అనే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఇక ట్రైలర్ చూస్తుంటే రాబోయే కాలంలో అనగా 2064లో మనుషులు ఎలా ఉంటారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుండగా.. భవిష్యత్తులో మానవులు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, ఎలా మరణిస్తారు అనే అంశాలు భయంకరంగా ఉన్నాయి. ప్రజెంట్ ‘కలియుగమ్-2064’ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విశేష స్పందన లభిస్తుంది.






