- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోయిన్‌ని చూసి షాక్ అయ్యా.. శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!
శ్రీకాంత్ మాట్లాడుతూ.. లయను దూరం నుంచి చూసి ఎవరో కొత్త హీరోయిన్ అనుకున్నానని తెలిపారు. ఆమె అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం మారలేదని ఈ నటుడు చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాంత్ - లయ జంటగా తెరకెక్కిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శ్రీకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. నేను, లయ గతంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించాం. ఆ సినిమాలకు మంచి గుర్తింపు రావడంతో పాటు మా జంటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. చాలా కాలం తర్వాత మళ్లీ మేమిద్దరం కలిసి ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమాలో నటించాం.
ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లోకి లయ మొదటి రోజు ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఆమెను కాస్త దూరం నుంచి చూసాను. ఎవరో కొత్త హీరోయిన్ అయి ఉంటుందని అనుకున్నాను. కానీ దగ్గరకు వచ్చాక చూసి షాక్ అయ్యాను. ఆమె అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. నేను మాత్రం కాస్త బుగ్గలు పెంచుకుని లావుగా అయ్యాను. కానీ లయ మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలు జే క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






